పక్షవాతంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తండ్రి
కూతురు వివాహానికి ఎమ్మెల్యే సహాయం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ,పడమటి కేశవపూర్ గ్రామంలో పక్షవాతం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు, తన కూతురు వివాహానికి సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి జనగమ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు.పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రావుల ఆనందం పక్షవాతం వచ్చి ఆర్థికంగా ఇబ్బందులకు గురై కూతురు వివాహానికి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని, చల్ల ఇండస్ట్రీస్ అధినేత ,సామాజికవేత్త చల్ల శ్రీనివాస్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేకు తెలియజేయడంతో మానవత దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే 25 వేల రూపాయలు వెంటనే వారితో పంపించారు. ఆ డబ్బులను చల్ల శ్రీనివాస్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారికి అందించారు .ఆ కుటుంబం ఉన్న పరిస్థితులలో , ఎమ్మెల్యే సహాయం అందించడంతో వారు ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామని వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని తెలియజేశారు.