విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
–నంది వనపర్తి ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగిన చిల్డ్రన్స్ డే
ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ శాస్త్రి
మన సాక్షి గొంతుక : యాచారం
విద్యార్థులలో విద్యాభ్యసన సామర్థ్యాలు పెంచడం కోసం సమష్టి కృషి అవసరమని వెంకట రామశాస్త్రి అన్నారు. గురువారం పాఠశాలనందు పేరెంట్, టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లి తండ్రులు తమ పిల్లల ఎదుగుదల కోసం ఎన్నో కలలు కంటారని వాటి సాధన కోసం బాల్యం లోనే మంచి బాటలు వేయాలన్నారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులకు ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో అంతే సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులకు ఇంటి దగ్గర మోబైల్ ఫోన్లు, వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వచ్చే మార్చి లో పదవతరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థులు పదవ తరగతి లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు రమావత్ కిషన్, శిరీష ,పద్మ శ్రీ, శ్రీలత, సుధారాణి,పద్మలత, వెంకటేశం, శ్రీనివాస్ , లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.