మండల సర్పంచులు లేకుండా సర్పంచుల ఫోరం ఎన్నుకోవడం హాస్యస్పదం..
సర్పంచుల ఆధ్వర్యంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఎన్నుకోవాలి…
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న….
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
మండల సర్పంచుల ఆధ్వర్యంలో సర్పంచుల ఫోరం అధ్యక్షున్ని ఎన్నుకోవాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న అన్నారు.మండలంలోని సర్పంచులు లేకుండా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తిగా హాస్యాస్పదమని అని అన్నారు. మండల సర్పంచుల ఆధ్వర్యంలోనే సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల ఫోరం అనేది గ్రామ పాలనకు కీలకమైన వేదిక అని, అలాంటి ఫోరం ఎన్నికల్లో మండల సర్పంచులను పక్కన పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సర్పంచుల సమిష్టి అభిప్రాయాలు, సూచనలు లేకుండా ఫోరం అధ్యక్షుడిని ఎంపిక చేయడం వల్ల గ్రామాల సమస్యలు, అభివృద్ధి అవసరాలు సరైన రీతిలో ప్రతిబింబించవని పేర్కొన్నారు.మండల స్థాయిలో గ్రామాల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగం కోసం సర్పంచుల ఫోరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందువల్ల మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొనే విధంగా సమావేశం నిర్వహించి, ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా సంబంధిత అధికారులు, నాయకులు జాగ్రత్త వహించాలని, సర్పంచులభవిష్యత్తులో ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా సంబంధిత అధికారులు, నాయకులు జాగ్రత్త వహించాలని, సర్పంచుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న కోరారు.


