Sunday, March 1, 2026

ఏబీవిపి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు 

ఏబీవిపి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:

ఏబీవీపీ జనగామ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు – ‘పరాక్రమ్ దివస్’ నిర్వహించడం జరిగింది.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి,దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప విప్లవకారుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఏబీవీపీ జనగామ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ లా ఫోరం కో కన్వీనర్ తోట హృతిక్ సాయి మాట్లాడుతూ*

నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పరాక్రమ్ దివస్’ తొలుత నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి,ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. అర్పించడం జరిగింది”చలో ఢిల్లీ” మరియు “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి,నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అనే నినాదాలతో భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీశాలి నేతాజీ అని కొనియాడారు.నేటి తరం బాధ్యత:యువత నేతాజీ అడుగుజాడల్లో నడవాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశగాని సాయి,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular