పోచన్నపేట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొయ్యడి శ్రీనివాస్ గౌడ్

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొయ్యడి శ్రీనివాస్ గౌడ్ ను జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ,నాయకులు మద్దతు పలికారు. సర్పంచి ఎన్నికలో పోచన్నపేట గ్రామంలో మెజార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కష్టపడాలని గ్రామ శాఖ అధ్యక్షుడు అక్కిరెడ్డి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థిగా నియమితమైన కొయ్యడి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల, ప్రజల అండదండలతో గెలిచి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి ముందు ఉంటానని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో భీమగోని రాములు ,ఆరే వెంకటయ్య, ఆరె పాండు, పోతుల కిష్టయ్య, మంత్రి సిద్ధులు, పాముకుంట నరసయ్య, తాండూరి భాను, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలం అధ్యక్షుడు నల్ల మహేందర్, రాముని మదన్మోహన్, శివరాములు, దాత్రపు నరేష్,కోక్కలకొండ బాబు, మేకల ఉపేందర్ రెడ్డి, ఇస్మాయిల్, జూల కృష్ణ, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

