Sunday, March 1, 2026

పోచన్నపేట ప్రజాసేవ కోసం సర్పంచ్ బరిలో పోతుల రామన్న…

పోచన్నపేట ప్రజాసేవ కోసం సర్పంచ్ బరిలో పోతుల రామన్న…

ఆశీర్వదిస్తే ప్రజలను ఆదుకుంటా కాపాడుకుంటా…..

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం,పోచన్నపేట గ్రామ ప్రజల కష్టకాలంలో, ఆపదసమయంలో అండగా నిలుస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న రామన్న ఇప్పుడు సర్పంచ్ పదవికి బరిలోకి దిగారు. గ్రామంలో ప్రతి గడపలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని పోతుల రాములు యాదవ్ స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్ పదవి తాను పోటీ చేయడానికి అవకాశం రావడంతో గ్రామానికి మరింత సేవ చేసే అవకాశంగా భావించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు.కరోనా సమయంలో గ్రామంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో తాను స్వయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా గ్రామంలో మృతి చెందిన కుటుంబాలకు తనవంతు ఆర్థిక సహాయం అందించానాని, మరింత సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

పోచన్నపేట అభివృద్ధి కోసం, ప్రతి కుటుంబం ముందుకు సాగేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని సేవగా మరలిస్తాను” అని రామన్న హామీ ఇచ్చారు.గ్రామాభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం పని చేయడమే తన ప్రధాన లక్ష్యమని రామన్న తెలిపారు. ఎన్నికల వేళ పోచన్నపేట రాజకీయ వాతావరణంలో ఆయన పోటీ కొత్త చైతన్యం నింపనుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular