Sunday, March 1, 2026

తమ్మడపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సానిక రాజు

కాంగ్రెస్ లో మొదలైన మార్పు….

తమ్మడపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సానిక రాజు…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో మార్పు మొదలైంది. గత ఎన్నికలలో మండలంలో 15 సర్పంచ్ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొమ్మూరీ ప్రశాంత్ రెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతూ కార్యకర్తలను కలుస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ్మడపల్లి గ్రామంలో కార్యకర్తలు అందరు కలిసి జనగామ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి , బచ్చన్నపేట మండల ఇంచార్జ్ బండ కింది హరిబాబు గౌడ్, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్, మాజీ మార్కెట్ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, బాలకిషన్ గౌడ్, గుర్రపు బాలరాజు ల ఆదేశాల మేరకు తమ్మడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సానిక రాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ బలోపేతానికి ముందుండి కృషి చేస్తానని, గత ఎంపీ ఎన్నికలలో ఏ విధంగా మెజార్టీ వచ్చిందో అదేవిధంగా రాబోయే ఎన్నికలలో మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు నేరుగా అందడం జరిగిందని ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా పయ్యవుల రాజు ,బొడిగం లింగారెడ్డి, గౌరవ అధ్యక్షుడుగా కంసాని బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోలకొండ రాజయ్య, కంసాని మధుసూదన్ రెడ్డి, కోశాధికారిగా కొడుదుల విజయ్, కార్యదర్శిగా దొమ్మాట సిద్ధులు, బాదం ఆంజనేయులు, దొమ్మట నరసయ్య, మహిళా అధ్యక్షురాలుగా పిల్లి సువర్ణ, యూత్ అధ్యక్షుడిగా మేకల నరేష్, యూత్ ఉపాధ్యక్షులుగా బాదం మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ గా నూక అమర్, బాదం రాజశేఖర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular