Sunday, March 1, 2026

బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్

— తీవ్రంగా ఖండించిన జాయ మల్లేష్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:

కొమురవెల్లి మల్లన్న దేవాలయం సంబంధిత విషయాలపై ఈఓ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమైన బీసీ జేఏసీ నాయకులను అర్థరాత్రి వేళ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.ఈ ఘటనపై బీసీ జేఏసీ వర్కింగ్ కమిటీ కన్వీనర్ జాయ మల్లేష్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.“బీసీ హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులేనా? ప్రజాస్వామ్యాన్ని బంధించే ప్రయత్నం చేసినా బీసీల గొంతును మూయలేరు” అని మల్లేష్ మండిపడ్డారు.కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో జరుగుతున్న అన్యాయాలపై శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులను అడ్డుకోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.“మా నాయకులను అరెస్టు చేస్తే ఉద్యమం ఆగిపోతుందనుకోవడం ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు.బీసీల స్వరాన్ని అణిచే వేసే ప్రయత్నం ఎంత చేసినా అది తిరిగి వారి పతనానికి కారణమవుతుంది” అని మల్లేష్ హెచ్చరించారు.కొమురవెల్లి దేవాలయం బీసీ వర్గాల ఆరాధ్యస్థలం అని,అక్కడ పరిపాలనలో పారదర్శకత కోసం అడిగిన ప్రశ్నలకు బదులుగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని ఆయన అన్నారు.అరెస్టయిన బీసీ జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, కేసులు ఉపసంహరించుకోవాలని మల్లేష్ డిమాండ్ చేశారు. లేకపోతే బహుళ స్థాయిలో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాయని స్పష్టం చేశారు.ఈ అక్రమ అరెస్టైన వారిలో బీసీ జేఏసీ నాయకులు చౌదరపల్లి శేఖర్,పాశం శ్రీశైలం,ప్రశాంత్ యాదవ్,కోలిపాక నరసింహులు,సేవెల్లి మధు,తదితరులు ఉన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular