అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి
రైతు రుణమాఫీపై బచ్చన్నపేట చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకుల నిరసనలు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో
రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణ రెడ్డి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. చౌరస్తా వద్ద ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫి చేయాలని మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సచివాలయం ఆవరణలో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన స్థలంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో జరగబోతున్న ధర్నాకు పాల్గొనే ముందు బచ్చన్నపేట చౌరస్తా వద్ద టిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ ,మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఈదులకంటి ప్రతాపరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, బాల్ రెడ్డి, అజాం ,మధు ప్రసాద్, కొండి వెంకటరెడ్డి, శివకుమార్ గౌడ్, వేణు, గంధ మల్ల నరేందర్, బొమ్మెన ఆంజనేయులు, యాకం రెడ్డి, మహేందర్ రెడ్డి, కిష్టయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

