విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో
ఘనంగా పోచమ్మ బోనాలు


మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున పోచమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు ఇంటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో డప్పు చప్పుళ్లు, శివశక్తుల నాట్యాలతో, భక్తి పారవశ్యంతో పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలను అందరినీ చల్లంగా చూడు తల్లి అని వేడుకున్నారు. ఈ సందర్భంగావిశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కోడూరి వెంకట చారి,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి, సిద్ధోజు నరసింహ చారి, మహంకాళి శ్రీను , కోడూరి బ్రహ్మచారి , కోడూరి చంద్రమౌళి, కోడూరి నరసింహ చారి, కోడూరి వెంకటేశ్వర్లు, మహంకాళి బ్రహ్మచారి, కోడూరి కార్తీక్, వేములవాడ బాలరాజు, మేడోజు అరుణ్ కుమార్, సిద్ధోజు సాయిరాం, వేములవాడ ప్రవీణ్, ఎర్రోజు కృష్ణమోహన్, కోడూరి కృష్ణ, మహంకాళి బాలచారి, మహిళలు కోడూరి మమత ,కోడూరి లావణ్య , కోడూరి రామలక్ష్మి, కోడూరి లావణ్య, మహంకాళి రేణుక, సిద్ధోజు నిర్మల, మహంకాళి అనిత, కోడూరి లక్ష్మి, కోడూరి మంజుల, మేడోజు పద్మ, మహంకాళి లక్ష్మి, కోడూరి రజిత, వేములవాడ తిరుమల, కోడూరి కాంచన, కోడూరి సోనీ తదితరులు పాల్గొన్నారు

