పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కానుక అందజేత
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం ::జిల్లా సందీప్

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
పలు సేవా కార్యక్రమాలు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న జిల్లా సందీప్ మరోసారి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబమైన ఎర్రకోకుల కనకవ్వ చంద్రయ్య కూతురు సాహిత్య (భార్గవి) వివాహానికి బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జిల్లా సందీప్ కానుకగా ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం గా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా సందీప్ మాట్లాడుతూ బచ్చన్నపేట కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు ,నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల ఎల్లయ్య ,ఎద్దు హరీష్, హరికృష్ణ , జంగిటి సిద్ధులు, ఏనుగుల రాజేష్, అఖిల్ మాల, నీల నవీన్ తదితరులు పాల్గొన్నారు

