ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే ఎమ్మెల్యే పల్లా పై అక్రమ కేసులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు, పార్టీఫిరాయింపులకు లొంగలేదనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై రాజకీయకక్ష్య సాధింపు చర్యలకు, అక్రమ కేసులు బనాయింపుకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని బచ్చన్నపేట సర్పంచుల పొరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన ద్వారామాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు,అరెస్టులుఎదుర్కొన్నవ్యక్తి పల్లా రాజేశ్వర్రెడ్డిఅన్నారు,ఆనాడు ప్రభుత్వంలోనైనా ఇప్పుడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ గలిగిన ప్రజా ప్రతినిధిగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసిన నాయకుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిఅన్నారు. అన్ని పర్మిషన్లు ఉన్న కావాలనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ,ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజా క్షేత్రంలో ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించడానికి పోరాటం చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.

