Monday, March 2, 2026

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సంబరాలు

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సంబరాలు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

తెలంగాణా పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తూ బచన్నపేట లో సంబరాలు జరుపుకున్నారు. జనగామ డిసిసి అద్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బచన్నపేట చౌరస్తాలో మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియమింపబడ్డ మహేష్ కుమార్ గౌడ్ కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా పార్టీ పటిష్ఠతకు రాబోయే అన్ని రకాల ఎన్నికలకు సంబంధించి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతారని అన్నారు.
పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి సముచిత స్థానం ఇవ్వడంలో తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశీస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జిల్లా సందీప్ ,సీనియర్ నాయకులు జిల్లెల్ల దయాకర్ రెడ్డి, అల్వాల ఎల్లయ్య, గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్, చిన్నరామచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎద్దు హరీష్, గుర్రపు బాలరాజు,బొమ్మ రాజయ్య, గంధ మల్ల క్రిష్టయ్య, దేవరకొండ రమేష్, హరికృష్ణ, వేముల భద్రయ్య, సందెల రాములు కొత్తపల్లి రాజమౌళి, అవధూత శ్రీనివాస్ ,గడ్డమీద రామాంజనేయులు, సుభాష్, గంగరబోయినఐలయ్య, నీల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular