మృతుల కుటుంబాలకు పరామర్శించిన నూకల బాల్రెడ్డి

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జంగిటి విద్యనాథ్
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,గోపాల్ నగర్ గ్రామంలో నసిరుద్దీన్ కుమారుడు యువకుడు షాకీర్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో జంగిటి విద్యనాథ్ ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలియజేశారు.
చిన్నరాంచర్ల గ్రామం లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య రెడ్డి మామ ఉపాధ్యాయుడు పిన్నింటి మాధవరెడ్డి రిటైర్డ్ మృతి చెందగా, చిన్న రామచర్ల గ్రామంలో వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులను మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
బండనగరం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు
ఇజ్జగిరి రాములు తండ్రి ఇజ్జగిరి బాలయ్య నిన్న రాత్రి అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, జంగిటి విద్యనాథ్, మాజీ మార్కెట్ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, అల్వాలఎల్లయ్య, జిల్లా సందీప్,మహమ్మద్ మసూద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఘనపురం నాగేష్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, కొప్పుల శ్రీధర్,దాచేపల్లి నర్సింగరావు,దిడిగా రమేష్,మాజీ సర్పంచ్ ఆముదాల మల్లారెడ్డి, గుర్రపు బాలరాజు, జ్యోతి భాస్కర్, ఎద్దు హరీష్, ఇజ్జగిరి పరుశురాములు, నిడిగొండ సత్తయ్య, చల్ల సురేందర్ రెడ్డి, చల్ల సుధాకర్ రెడ్డి, గంగరబోయినమహేందర్ ,ఎల్లయ్య ,చింతల కర్ణాకర్, పర్వతం యాదగిరి , బొట్టు సుధాకర్ తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

