అమ్మ జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
– రూ.6.50 లక్షలతో వైకుంఠ రథం అందజేసిన కుమారులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో శ్రీరం శెట్టి రాజమ్మ ఫౌండేషన్ (అమ్మ ) జ్ఞాపకార్థం వారి కుమారులు ఉచిత వైకుంఠ రథాన్ని సోమవారం రోజున గ్రామపంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అమ్మ జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనిషి బతికున్నన్నీ రోజుల కంటే చనిపోయినప్పుడు చివరి మజిలీ కార్యక్రమాలకు సహాయపడాలనుకుని ఆరు లక్షల 50 వేల రూపాయలతో వైకుంఠ రథాన్ని గ్రామ ప్రజలకు అందజేశానన్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల నిర్వాణ కోసం ఈ వైకుఠ రథం ఉపయోగపడుతుందన్నారు. కావున గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తన గ్రామానికి తన వంతుగా గ్రామ అభివృద్ధికి ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. శ్రీరం శెట్టి రాజమ్మ ఫౌండేషన్ (భర్త) రాములు, కుమారులు యాదగిరి సార్ ,రాజు, నాగరాజు ,కూతురులు మేఘమాల కరుణ అల్లుళ్లు వెంకటయ్య సార్ రాజయ్య , గట్టు మల్లేశం, చింతపండు అంజయ్య, గుర్రాల రవీందర్ రెడ్డి ,రామిని మదన్మోహన్, కోక్కలకొండబాబు, ఈర్ల శివరాములు, ఆకిరెడ్డి శ్రీధర్, బోడ కుంటి మల్లయ్య , మామిడి ఐలయ్య, బాలచందర్, కృష్ణ, మామిడి మల్లయ్య, నీల పాపయ్య ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

