వినాయక నిమజ్జనం స్థలం(గుడి చెరువు) పరిశీలన
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్బంగా నిమజ్జన స్థలాని(గుడి చెరువు) సీఐ సాయి రమణ ,ఎస్సై కంకాల సతీష్ కుమార్, నిమర్జనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. నిమజ్జనానికి కావాల్సిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని మరియు నిమజ్జనానికి వచ్చేభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లను చేయాలనీ లైట్లు బారికెట్లు సమకూర్చాలని పంచాయతీ మరియు ఎలక్ట్రికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగిటి విద్యనాథ్, తదితరులు పాల్గొన్నారు.