Monday, March 2, 2026

కొమ్మూరి ఏకపక్ష ధోరణి వీడాలి

కొమ్మూరి ఏకపక్ష ధోరణి వీడాలి

– మండల కాంగ్రెస్ నాయకులు గిద్దెల రమేష్

మన సాక్షి గొంతుక  /బచ్చన్నపేట మండలం

:జనగామ జిల్లా బచ్చన్నపేట మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులుపడమటి కేశవాపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ మాట్లాడుతూ, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు,జిల్లా ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి,కాంగ్రెస్ కార్యకర్తల అభ్యున్నతి కోసంకృషి చేయాలి కానీ, గ్రూపు రాజకీయాలకు వత్తాసు పలుకుతూ,కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని, అందువలనజనగామలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.సొంత పార్టీ నేతలే కొమ్మురిప్రతాప్ రెడ్డి ని విమర్శిస్తున్నారు.అంటే అతని పనితీరుకు నిదర్శనమని అన్నారు. గ్రామాలలోపనిచేసిన కాంగ్రెస్ నాయకులను నీవల్లనే ఓట్లు తక్కువవచ్చాయని నువ్వు ఏ పాటిగా పని చేశావో తెలుసుననినాయకులను అవమానిం చడం సరైనది కాదన్నారు. కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుల సలహాల సూచనలు పాటించి,జనగామ నియోజకవర్గం తో పాటుగా మండల, గ్రామాల స్థాయిపార్టీ నాయకులతో ప్రజల అందరినీ కలుపుకుపోయే నాయకుడుకావాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular