Monday, March 2, 2026

ప్రజా నాయకుడి పై తప్పుడు ఆరోపణ లు

ప్రజా నాయకుడి పై తప్పుడు ఆరోపణ లు

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవు

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం

తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వారైనా చట్టానికి అతిధులు కాదని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా నాయకుడు, అపర భగీరధుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తన రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ కూడా చిన్నపాటి హాని చేయలేదని, వారిపై కావాలని దుష్ప్రచారం సృష్టించి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత డబ్బులతో కాలువలు ఎస్ట్ మేషన్ ఏపించి, డ్యాములు తెప్పించి బీడు భూములకు నీరు అందించిన ఘనత కొమ్మూరి ప్రతాపరెడ్డి ది అన్నారు ఇప్పటికి వారితో కలిసి పని చేసిన జిల్లా మండల నాయకులని అడిగిన వారి నిజాయితీ గురించి చెప్తారని అన్నారు .అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు అని అన్నారు. ఇకమీద ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి మండలంలో ,జిల్లాలో వ్యతిరేకంగా పనిచేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాసాపేట రవీందర్ రెడ్డి ,జంగిటి విద్యనాథ్ ,అల్వాల ఎల్లయ్య, జ్యోతి భాస్కర్, అక్కిరెడ్డి శ్రీధర్ ,ఎద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular