ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శ

ఆరోగ్యం మంచిగా చూసుకో తల్లి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల ఎంపిటిసిల పోరం మండల మాజీ అధ్యక్షుడు దూడల కనకయ్య గౌడ్ తల్లి నర్సమ్మకు కాలు ప్యాచర్ కావడంతో నీలిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిని పరామర్శించారు. జనగామ నియోజకవర్గం ప్రజలకు నీలిమ ఆసుపత్రిలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా తెలియజేశారు.

