నూతన ఎస్సైని సన్మానించిన జర్నలిస్టులు…

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై హమీద్ ను శనివారం జర్నలిస్ట్ లు కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ… ప్రజలకు అధికారులు వారధిగా జర్నలిస్టులు పని చేయాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్(రి. నెంబర్272/2023) అధ్యక్షుడు జంగిలి సాయి బాబా, చింతల మధు కృష్ణ, ఉపాధ్యక్షులు చింతల రాజిరెడ్డి, కార్తిక్ పాల్గొన్నారు.

