కష్టకాలంలో మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా…

ఫిరోజ్ ను అభినందించిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బిఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట మండల కోఆర్డినేటర్ ఫిరోజ్ గా సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో వెళ్తున్న మండల పార్టీ కోఆర్డినేటర్ ఫిరోజ్ కు కేక్ కట్ చేసి బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ ఫిరోజ్ మాట్లాడుతూ కష్ట పరిస్థితుల్లో పార్టీ వెన్నంటి ఉండే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రియతమ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజులలో ప్రతీ కార్యకర్తకు మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు దూడల కనకయ్య, బిఆర్ఎస్ నాయకులు ముసిని రాజు గౌడ్, ఎండి ఆజాం, వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజనర్సు, నర్సిరెడ్డి, కోనేటి స్వామి, పర్వతం మధు ప్రసాద్, బందారం వినయ్ కుమార్, మీసా శ్రీనివాస్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

