Sunday, March 1, 2026

పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం 

పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం 

బిఆర్ఎస్ పార్టీ  బచ్చన్నపేట మండల కోఆర్డినేటర్ ఫిరోజ్ 

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం

తెలంగాణలో పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందనీ టిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ ఫిరోజ్ అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కానుకగా బతుకమ్మ చీరలు ప్రతి ఇంటి ఆడబిడ్డకు పంపిణీ చేసేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇప్పటివరకు కూడా బతుకమ్మ చీరల ఊసే లేదని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరం గడిచిన ఇంతవరకు ఆ పథకం అమలే లేదని అన్నారు పెళ్లి అయిన మహిళలకు లక్ష రూపాయలతో పాటు బంగారం ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారని తెలియజేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2లక్షల రుణమాఫీ కొందరికి మాత్రమే చేసి, రైతు భరోసా కాదు కదా ఇప్పటివరకు రైతు బందు కూడా వేయలేదు అని దుయ్యబట్టారు, అలాగే 33 కొర్రీలు పెట్టి రైతు ఋణ మాఫీ, రైతు బంధు ఎగ్గోటాలి అని ప్రభుత్వం అలోచిస్తూదాని, ఎట్టి పరిస్థితిలో ప్రతి రైతుకూ రుణమాఫీ జరిగే వరకు ప్రతి రైతు అకౌంట్ రైతు బంధు జమ అయ్యే వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి MLA, జనగామ గారి ఆధ్వర్యం BRS పార్టీ తరుపున మా పోరాటాలు ఉంటాయి అని తెలియజేశారు., డైవర్ట్స్ రాజకీయాలు మాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పథకాలు అమలు చేసేవిధంగా ప్రభుత్వం పని చేయాలని సూచించారు,

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular