మేకల మందను అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
జనగామ పట్టణ కేంద్రంలో 23 వ వార్డు బీరప్ప గుడి ఏరియా,మల్లన్న గుడి ఏరియా లో కెమిడి లక్ష్మయ్య/మల్లయ్య (60) సంవత్సరాలు కు చెందిన 30 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు.మంగళవారం ఉదయం సుమారు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో దొంగిలించినట్లు తెలుస్తుంది.దొంగిలించబడిన మేకలలో పిల్ల తల్లుల మేకలు కూడా ఉన్నాయి.పిల్లలను విడిచి పెట్టి మేకలను ఎత్తుకెళ్లారు.ఎత్తుకెళ్లిన మేకల మంద విలువ నాలుగు లక్షల రూపాయలు వరకు ఉంటుందని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.బాధిత కుటుంబాన్ని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు,కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం,జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ మేకల దొడ్డిని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.మేకల మంద అపహారణతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.పండుగ దృష్ట్యా పోలిసులు పహారా పెంచి రక్షించాలని కోరుతున్నారు.

