ఎస్సై ని సన్మానించిన జంగిటివిద్యనాథ్

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన హమీద్ ను పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటివిద్యనాథ్ కాంగ్రెస్ మండల నాయకులతో వెళ్లి కలిసి శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అల్వాల ఎల్లయ్య, ఆముదల మల్లారెడ్డి, దిడిగా రమేష్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, గుర్రపు బాలరాజు గణపురం నాగేష్ ,చింతల కర్ణాకర్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

