కార్యకర్తల కుటుంబలకు మండల అధ్యక్షుడి పరామర్శలు


మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచాల వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని నింపారు.
గోపాల్ నగర్ గ్రామంలో
గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పస్తం పోశయ్య భార్య మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా సీనియర్ పార్టీ నాయకులు జంగిటి విద్యనాథ్ ,అల్వాల ఎల్లయ్య, జిల్లా సందీప్, దాచేపల్లి నర్సింగరావు, గుర్రపు బాలరాజు, దిడిగా రమేష్, వేముల వెంకట్ గౌడ్ ,దాచేపల్లి రాజయ్య, దేవరకొండ రమేష్, అవధూత శ్రీనివాస్ కురాకుల రవి, చల్ల సంతోష్ రెడ్డి, మంగళపల్లి కృష్ణమూర్తి,రామకృష్ణ, గంధ మల్ల కిష్టయ్య, ఉప్పలయ్య, మహిళా నాయకురాలు కృష్ణవేణి మల్లేశం, గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నగేష్ వల్లాల సత్యం, వద్ది ఎల్లయ్య ,చింతల కర్ణాకర్, పిట్టల రాములు, నీల నవీన్
తదితరులు పాల్గొన్నారు.

