మల్లన్న గుడి నిర్మాణానికి భూమి పూజ

పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగిటి విద్యనాథ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశవపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుడి నిర్మాణానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి, మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ యాదవ సంఘం ప్రెసిడెంట్ సోములు యాదవ్ ,యాదవ సంఘం పెద్దలు, గ్రామ పెద్దలు ,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

