ఘనంగా దుర్గ మాత నిమర్జనం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాన్ని బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామం చెరువులో ఘనంగా నిమజ్జనం చేశారు. దుర్గామాత కు బచ్చన్నపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలో దుర్గాదేవి విగ్రహాన్ని శోభయాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు, యువకులు దుర్గామాత నీ కొలుస్తూ నృత్యాలు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి పరదే శ్రీనివాస్ మహేందర్ , కర్ణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, అంజన్ రెడ్డి, శ్రీశైలం,రంగు కిట్టు, మల్లేశం శ్రీ సాయి, నాగరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు

