వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
పిఎసిఎస్ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ వేణుగోపాల్, పిఎసిఎస్ చైర్మన్ పూర్ణ చందర్అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2320, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2300, సన్న ధాన్యముకు 2800 రేటును నిర్ణయించిందన్నారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా సీఈవో బాలస్వామి,మాజీ సర్పంచ్ మేకల కవిత రాజు, డైరెక్టర్లు సిద్ధులు, ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసారం శ్రీనివాస్ రెడ్డి, బైరగోని దామోదర్ ,స్థానిక రాజయ్య, బెజాడి నాగరాజు, ఉపేందర్ రెడ్డి ,సిద్ధారెడ్డి శ్రీను , రాజయ్య తదితరులు పాల్గొన్నారు