Thursday, November 21, 2024

మహిళ కడుపులో 5 కిలోల కణతి…

మహిళ కడుపులో 5 కిలోల కణతి…

తొలగించిన జనరల్ సర్జన్ డాక్టర్ సిహెచ్ రాజమౌళి 

 

మన సాక్షి గొంతుక జనగామ

జనగామ జిల్లా కొడకండ్ల మండలం గ్రామం మొండ్రాయి కి చెందిన ఇటుకల తబిత (వయస్సు47). థామస్ భార్య గత కొంతకాలంగా అనారోగ్యముతో బాధపడుతూ రవళి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కి వచ్చి వైద్య పరీక్షల కోసం డాక్టర్ ని సంప్రదించగా వెంటనే పేషెంట్స్ దగ్గరికి వెళ్లి చూసి రక్త పరీక్షలు , స్కానింగ్లు, ఎక్స్ రేలు , ఈసీజీలు కావలసిన అన్ని దగ్గర ఉండి పరీక్షలు చేయించి స్కానింగ్ ప్రకారము కడుపులో కణతి ఉంది కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పడం జరిగింది లేనియెడల పెద్ద ప్రాణానికి హాని ఉంటుందని.కుటుంబ సభ్యులకు అన్ని విధాల ఆపరేషన్కు ఒప్పుకోవడం జరిగింది  రవళి నర్సింగ్ హోమ్ హాస్పటల్లో ఉదయం 8 గంటల ప్రాంతాన ఆపరేషన్ చేసి కడుపులో కణతి బయటికి తీయడం జరిగింది, దాదాపు బరువు 5కిలోల 100 గ్రాములు ఉందని, డాక్టర్ రఘు అనస్తిసియా పర్యవేక్షణంలో డాక్టర్ సిహెచ్ రాజమౌళి సర్జన్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోర్తాలా ప్రభాకర్, అల్లిసేరి శ్రీనివాస్, అల్వాల రమేష్, కుంట మల్లేష్ హాస్పిటల్ స్టాపు, మరియు సిస్టర్స్ పాల్గొనడం జరిగింది.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular