ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చిన మహా నాయకుడు పల్లా

బండనాగరం నుండి కట్కూరు గ్రామానికి బీటి రోడ్డు మంజూరు
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీపీ
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలంలోని బండనాగరం నుండి కట్కూరు గ్రామానికి బీటి రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి రెండు గ్రామాల ప్రజల తరఫున మాజీ ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చిన మహా నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అని, ఈ రోడ్డు ద్వారా ప్రజలు ఇబ్బందు పడుతున్నారని తెలిసి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు మంజూరు చేయించి మాట నిలుపుకున్న మహ మహానేత అని మాజీ ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

