బిఆర్ఎస్ నాయకుల మాటలు విడ్డూరం
ఓ బి సి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ యాదవ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
అభివృద్ధి ప్రదాత,జనగామ డిసిసి అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్, కొమ్మూరి ప్రతాపరెడ్డి చొరవతో బండ నాగారం టు కట్కూర్ ,కేసిరెడ్డిపల్లి టు గోపరాజు పల్లి బీటీ రోడ్లో మంజూరు చేయించిన ఘనత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ది అని ఓ బి సి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ ఇంచార్జ్ కొమ్మురి ప్రతాపరెడ్డి పంచాయతీ శాఖ మంత్రి సీతక్క తో మాట్లాడి మంజూరు చేపిస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే నిధులు తెచ్చిండు మా ఎమ్మెల్యే మంజూరు చేయించుండు అని మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. జనగామ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు మేమే చేశాము మేమే చేశాం అంటున్నారు తప్ప వారు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు అని అన్నారు. స్థానికేతురుడు అయిన పల్లా రాజేశ్వర్రెడ్డి కి జనగామ నియోజకవర్గం నీ అభివృద్ధి చేయాలని పట్టింపు లేదు అని అన్నారు. మునిగిపోతున్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని తపన తప్ప అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎమ్మెల్యేకు లేదని అన్నారు.