యువతీ అదృశ్యం
ఇద్దరు అనుమానీతులపై కేసు నమోదు…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
యువతి మిస్సింగ్ కేసులో ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేసినట్లు బచ్చన్నపేట ఎస్సై హమీద్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కొడవటూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల 15 సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఇందులో బచ్చన్నపేట కి చెందిన ఓ వ్యక్తి ,సలాక్పూర్ గ్రామం చెందిన మరో వ్యక్తి పై అనుమానం ఉందని యువతీ తండ్రి పిర్యాదుతో వారిద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.