పదేళ్లలో రోడ్లు వేయలేకపోయిన బిఆర్ఎస్ పార్టీ
సంవత్సరంలోపే మార్పు చూయించిన కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి
బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు ఖండిస్తున్నా చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న
బీటీ రోడ్ల మంజూరు పై బహిరంగ చర్చకు బిఆర్ఎస్ నాయకులు సిద్ధమా
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీటీ రోడ్లు వేయలేకపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కొమ్మూరి ప్రతాపరెడ్డి సారధ్యంలో బండ నాగారం టు కట్కూర్ రోడ్డును మంజూరు చేయించుకోవడం జరిగిందని చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు మా ఎమ్మెల్యే రోడ్డు మంజూరు చేయించిండు అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి మట్టి రోడ్ల తో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క దగ్గరికి వెళ్లి నిధులు మంజూరు చేయించారని, నిధులు మంజూరు కాగానే ఇది మా ఎమ్మెల్యే చేసిండు అని ప్రజలలో టిఆర్ఎస్ నాయకులు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీటీ రోడ్ల మంజూరు పై బహిరంగ చర్చకు సిద్ధమా అని టిఆర్ఎస్ నాయకులకు సవాళ్లు విసిరారు. రానున్న రోజుల్లో జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కట్కూరు గ్రామంలో గత మాజీ సర్పంచ్ గాని మాజీ ఎంపీపీలు గాని అభివృద్ధి పనులు చేయలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్పు మొదలైందని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ప్రజలు కూడా ఖండించాలని పిలుపునిచ్చారు.