బీటీ రోడ్డు మంజూరు చేయించిన కొమ్మూరి కి ప్రత్యేక ధన్యవాదాలు

నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జంగిటి నరేష్
మన సాక్షి గొంతుక డెస్క్
నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా కృషిచేస్తూ, బచ్చన్నపేట మండలంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించిన కొమ్మూరి ప్రతాపరెడ్డికి నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జంగిటి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో , బచ్చన్నపేట మండలం,కట్కూరు నుండి బండనగరానికి, కేసిరెడ్డిపల్లి నుండి గోపిరాజు పల్లి గ్రామాలకు బీటీ రోడ్డు సాంక్షన్ చేయించిన కొమ్మూరి ప్రతాపరెడ్డి కి నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జంగిటి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. మరి అంతే కాకుండా భవిష్యత్తులో బచ్చన్నపేట మండలంలో మట్టి రోడ్డు లేకుండా అన్ని బీటీ రోడ్ల నిర్మాణానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎల్లవేళల కృషి చేస్తాడని నరేష్ పేర్కొన్నారు.

