రైతన్న పక్షపాతి సీఎం రేవంతన్న
ప్రజాపాలన లో రైతన్న ప్రభుత్వం నడుస్తుంది
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకట చారి
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
ప్రజా ప్రభుత్వంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్వేత వెంకన్న అన్నారు. బచ్చన్నపేట మండలం కోడవటూర్ గ్రామంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడి రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు,రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2320, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2300, సన్న ధాన్యముకు 2800 రేటును నిర్ణయించిందన్నారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, మాసాపేట రవీందర్ రెడ్డి , ఎండి మసూద్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, మట్టి బాలరాజు ,నీల రమేష్ ,తిరుపతిరెడ్డి, మైపాల్ రెడ్డి, యువ నాయకుడు ఎద్దు హరీష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.