రైతు లకు రైతు భరోసా పథకం ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి , మంత్రి తుమ్మల పదవులకు రాజీనామా చేయాలి.
బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి ,బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్.
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
గతంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రైతులకు రెండు పంటలకు రైతు బందు పథకం ఇవ్వడం జరుగుతుంది మూడు పంటలకు ఎందుకు ఇవ్వరు అన్ని మాట్లాడం జరిగింది. అప్పటి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి మరియు గందమల్ల నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్ పంటకు రైతు భరోసా ఇవ్వలేం అనడం చాలా విడ్డూరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి అప్పటి రైతుబంధు పథకాన్ని ప్రారంభించినప్పటి ఏ సీజన్లో కూడా రైతు బందు రైతు బీమా పథకం ఆపలేదు అని అన్నారు.