మూడేళ్ల క్రితం తెగిపోయిన కాల్వ
సాగునీరు వృథా అవుతున్నదని, మరమ్మత్తులు చేపట్టాలని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం రోజున ప్రజా వాణి’ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా,అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్ హాజరుకాగా మాజీ మార్కెట్ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. బచ్చన్నపేట మండలం,నారాయణపురం-నక్కవానిగూడెం గ్రామాల మధ్య ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ (తపాస్పల్లి రిజర్వాయర్ ఫస్ట్ ఫేజ్) కాల్వమూడేళ్ల క్రితం వాగు దగ్గర తెగిపోవడంతో సాగునీరు వృథా అవుతున్నదని తెలిపారు.నారాయణపురం వాగు లో నీరు నిల్వ ఉండేలా మరమ్మతు చర్యలు చేపట్టాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మాసపేట రవీందర్రెడ్డి పలువురు రైతులతో కలిసి కలెక్టర్కు ఆర్జీ సమర్పించారు.