బచ్చన్నపేట ఎమ్మార్వో గా ప్రకాష్ రావు బాధ్యతలు స్వీకరణ..

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల ఎమ్మార్వో గా ఎన్ టి ప్రకాష్ రావు మంగవారం బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్గన్పూర్ లో డిఏవో గా పనిచేసిన ఆయన అక్కడి నుంచి బచ్చన్నపేట ఎమ్మార్వోగా బదిలీ పై వచ్చారు. ఇక్కడ ఎమ్మార్వో గా పనిచేసిన మైపాల్ రెడ్డి దేవరప్పుల మండల ఎమ్మార్వో గా బదిలీపై వెళ్లారు.
సన్మానించిన జర్నలిస్టులు
బచ్చన్నపేట మండలంఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ టి ప్రకాష్ రావును బచ్చన్నపేట మండల ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్(272/2023) అధ్యక్షుడు జంగిలి సాయిబాబా చింతల మధు కృష్ణ, వనమైన వెంకటేష్ గౌడ్, చింతల రాజిరెడ్డి లు శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

