బచ్చన్నపేట మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఇజ్జగిరి చంద్రశేఖర్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా క్షేత్ర స్థాయి లో పని చేయాలి.
జనగామ జిల్లా కన్వీనర్ దాసరి క్రాంతి
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ దాసరి క్రాంతి కుమార్ చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా బచన్నపేట మండల కో ఆర్డినేటర్ గాఇజ్జగిరి చంద్రశేఖర్ నియమించారు.బచన్నపేట మండలం, బండనాగారం గ్రామానికి చెందిన ఇజ్జగిరి చంద్రశేఖర్ ని జిల్లా నాయకులు,మండల నాయకులు అధ్వర్యంలో నియామక పత్రం అందించారు
అనంతరం డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.
పార్టీ కార్యక్రమాల పట్ల, అభివృధ్ది కార్యక్రమాల పట్ల నిరంతరం ఆక్టివ్ గా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియ జేయలని తెలిపారు,
ఏవైనా కల్పితాలను, ప్రతి పక్ష పార్టీ ల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని తెలియజేశారు.
అనంతరం కాంగ్రెస్స్ పార్టీ రాబోయే రోజుల్లో అనేక అభివృధ్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని,
అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడతారని వెల్లడించారు అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ.
తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.