Monday, March 2, 2026

ఇందిరమ్మ పాలన దేశానికి  ఆదర్శం

ఇందిరమ్మ పాలన దేశానికి  ఆదర్శం

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం

ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్ వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో ఇందిరమ్మ ఆదర్శమన్నారు. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరా గాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు అని కొనియాడారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి,ఓ బి సి సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జంగిటి నరేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేష్ ఖన్నా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కురాకుల రవి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు అమ్ రాజ్ భాగ్యలక్ష్మి ,గ్రామ శాఖ అధ్యక్షులు అక్కిరెడ్డి శ్రీధర్ ,గణపురం నాగేష్ ,నిమ్మ కరుణాకర్ రెడ్డి, దాసరం శ్రీనివాస్ రెడ్డి, బత్తిని వెంకటేష్,సీనియర్ నాయకులు బాలకిషన్ గౌడ్, ఎండి మసూద్, ఆముదాల మల్లారెడ్డి, ఈదులకంటి వెంకటరెడ్డి, గిద్దల రమేష్, దేవరకొండ రమేష్, చల్ల సురేందర్ రెడ్డి, జ్యోతి భాస్కర్, నిమ్మ కరుణాకర్ రెడ్డి,ఎద్దు హరీష్ ,తిరుపతి రెడ్డి, నీల రమేష్, బోయిని కొండ స్వామి, అవధూత శ్రీనివాస్, బుచ్చిబాబు,గంగరబోయిన మహేందర్ , చెవుల రాజేశం, హరికృష్ణ , జంగిటి సిద్ధులు, కంఠం కరుణాకర్, పస్తం పోచయ్య,సిరిపాటిరామదాసు,చింతల కర్ణాకర్ , వద్ది ఎల్లయ్య, పిట్టల రాములు , నీల జంపాయ, నీల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular