పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి
చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న
మన సాక్షి గొంతుక చేర్యాల
ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు జరిపే (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని సంపూర్ణ మద్దతు ధరను పొందాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత- వెంకట చారి, డిడిఎం ప్రసాద్ తెలిపారు. సోమవారంనుండి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు వాసవి కాటన్ ఇండస్ట్రీస్ లో ప్రారంభంఅయ్యాయి. 8 నుండి 12 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్ కు రూ.7521 నుండి7220 వరకు మద్దతు ధర ఉంటుందని, రైతులు తమ ఆధార్, బ్యాంక్ అకౌంట్,ఆధార్ తో అనుసంధానం ఉన్న మొబైల్ నెంబర్ను పత్తివిక్రయకేంద్రాలనుతీసుకురావాలని సూచించారు. సీసీఐ అధికారి అమిత్ మాట్లాడుతూ పత్తి తేమ శాతం12 శాతం మించకుండా తెచ్చుకోవాలని సూచించారు. తేమశాతం 12శాతం దాటితేపత్తిని కేంద్రాల్లో కొనుగోలు చేయబడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్కార్యదర్శి పరమేశ్వర్, వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి, చేర్యాల మున్సిపాల్ చైర్మన్అంకుగారి స్వరూపరాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బైరగోని భాను గౌడ్, బండారికనకయ్య, బైతి శ్రీనివాస్, తడక లింగమూర్తి, పాల లక్ష్మీ నారాయణ, సింగపాకకుమార్, వంగ కృష్ణ రెడ్డి, పెసర్ల అంజయ్య, అర్జుల పోసిరెడ్డి, లక్ష్మీ నాయక్ మార్కెట్సిబ్బంది, సీసీఐ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.