ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా
కట్కూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం
పాల్గొన్న వ్యవసాయం మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
కట్కూరు గ్రామంలో ప్రజలకు ఆరోగ్య సేవలు లక్ష్యంగా సామాజికవేత్త, చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న ఆర్విఎం ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా భారీ మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది ప్రజలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ ఉచితంగా అందించారు . 40 మంది కి ఉచిత చికిత్స అందిస్తూ ,వారికి కావలసిన ఆపరేషన్ చేయనున్నట్లు ఆసుపత్రి వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న మాట్లాడుతూ ప్రజలు బాగుంటే గ్రామం బాగుంటుందని ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమని, రానున్న రోజుల్లో పలు గ్రామాల్లో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.