కొమ్మూరి చొరవతోనే చేర్యాల కు కోర్టు మంజూరు
నియోజక వర్గ కిసాన్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ జంగిటి నరేష్ కుమార్
మన సాక్షి గొంతుక/జనగామ
చేర్యాల ప్రాంతంలో కోర్టు ఏర్పాటు చేయాలని, చేర్యాల ప్రాంత అభివృద్ధి గురించితెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి, పూర్తిస్థాయి కృషి చేసింది జనగామ డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అని నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటి నరేష్ కుమార్ అన్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి కల్లబొల్లి మాటలతో నేనే చేపించాను అని చెప్పడం సిగ్గుచేటు అని 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఏమి సేవ చేయకుండా కనీసం ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పల్ల రాజేశ్వర్ రెడ్డి నేను కోర్టు ఏర్పాటు చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు . కొన్ని అనుకూలమైన పత్రికల్లో వార్తలు రాయించుకోవడం తప్ప పల్లా రాజేశ్వర్ రెడ్డి కోర్టు కోసం మరియు ఈ ప్రాంతం కోసం ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు అన్నారు . ఇక ముందైనా, ఎప్పుడైనా ఈ ప్రాంతాని అభివృద్ధి చేయాలంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను తాము చేసినమని పనులుగా చెప్పుకోవడం బి ఆర్ ఎస్ వాళ్ళకి ఈ ఎమ్మెల్యేకి ఆనవాయితీగా మారింది అబద్ధపు ప్రచారం చేసుకోవడం తప్ప బీఆర్ఎస్ వాళ్లు మరియు ఎమ్మెల్యే ఈ ప్రాంతం కోసం చేసింది చేసేదేమీ లేదు అని వారు వ్యాఖ్యానించారు.