Monday, March 2, 2026

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలి. 

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలి. 

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడూరి మాహత్మ చారి

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడూరి మహత్మ చారి అన్నారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడూరి మహత్మ చారి ఇంటి వద్ద సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా అధికారులకు సహకరించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించి, వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అంతే విధంగా కృషి చేసిందన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగంగా సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల గణనతో ప్రభుత్వానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు తద్వారా పథకాలు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సమగ్ర వివరాలను అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ శ్రీదేవి, మహంకాళి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకిషన్ గౌడ్, చంద్రమౌళి, కంఠం అంజమ్మనారాయణ, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular