దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ జయంతి వేడుకలు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా సుధీర్ఘ కాలంపాటు పనిచేసిన నెహ్రూ.. నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించారు. అలహాబాద్‌లో విద్యను అభ్యసించి లా చదవడానికి ఇంగ్లండ్ వెళ్లారు. స్వదేశానికి తిరిగివచ్చిన తరవాత జాతీయోద్యమంలో ప్రవేశించి మహాత్మాగాంధీకి సన్నిహితులయ్యారు.భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొని నెహ్రూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా జాతీయోద్యమ నాయకుడు. జైలులో ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలను నెహ్రూ రచించారు. 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 చివరిగా 1946లో కూడా కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారు. ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి తొలి ప్రధానమంత్రిగా కీర్తి పొందారు. 1952, 1957, 1962లలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు అన్నారు.
ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి, బాలకిషన్ గౌడ్, ఆముదాల మల్లారెడ్డి, గిద్దెల రమేష్ , ఈదులకంటి వెంకట్ రెడ్డి, నల్ల మహేందర్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, వేముల వెంకట్ గౌడ్, మైపాల్ రెడ్డి, గణపురం నాగేష్, గుర్రపు బాలరాజు,దిడిగా రమేష్, ఎద్దు హరీష్ ,సిరిపాటి రామదాస్, గంగారబోయిన మహేందర్, కళ్లెం రమేష్, బాబు, చింతల కర్ణాకర్, మహిళా నాయకురాలు వేను వందన, నీల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.