Monday, March 2, 2026

బాధిత కుటుంబాలకు కొమ్మూరి ప్రతాపరెడ్డి పరామర్శ

నేనున్నాను….ఆధైర్య పడవద్దు..

బాధిత కుటుంబాలకు కొమ్మూరి ప్రతాపరెడ్డి పరామర్శ

ఆర్థిక సహాయం అందించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ,కట్కూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన వారి కుటుంబా సభ్యులను,వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబాలను జనగామ డిసిసి అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి , చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న పరామర్శించి మేమున్నామని మనో ధైర్యాన్ని నింపి, 5 కుటుంబ సభ్యుల ఒక్కొక్క కుటుంబానికి మార్కెట్ చైర్మన్ శ్వేతా వెంకన్న ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కొమ్మురి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, ఆపదలో ఉన్న కార్యకర్తలను ప్రజలను ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన శ్వేతా వెంకన్నను అభినందిస్తూ , రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని ,పేదలకు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కట్కూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట నరసింహులు , గుర్రపు బాలరాజు, ఎద్దు హరీష్ ,జ్యోతిభాస్కర్, నీల రమేష్,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular