మృతుల కుటుంబాలకు ఆపద బాంధవుడిలా ఆర్థిక సహాయాలు
అందించిన సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం,పోచన్నపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన నూనె నూనె నరసయ్య,ఇంజ చంద్రయ్య ల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి సామాజికవేత్త ,కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ 5000 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను పరామర్శించి, నేనున్నానని ధైర్యాన్ని నింపారు. రానున్న రోజుల్లో ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటికి వచ్చి అడగకుండానే ఆర్థిక సహాయం అందించిన పోతుల రాములు యాదవ్ కు రుణపడి ఉంటామని అన్నారు వారి సహాయాన్ని మరువలేమని తెలియజేశారు. ఈ సందర్భంగా కోక్కలకొండ బాబు ,బుడిగే రామచంద్రం ,ఈర్ల శివరాములు, వస్పరి నర్సింలు, తుప్పతి చంద్రయ్య ,శ్రీపతి అనిల్ ,కే లింగం, రేణిగుంట బాలయ్య ,కిష్టయ్య మంత్రి సిద్ధులు ,నర్మెట్ట బాలరాజు, మామిడి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


