గ్రామంలో నిరుపేదలను ఆదుకుంటా.. కాపాడుకుంటా..
పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సామాజికవేత్త పోతుల రాముల యాదవ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా,బచ్చన్నపేటమండలం,పోచన్నపేటగ్రామంలో నిరుపేదలను ఆపదలో ఆదుకుంటాఅని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,సామాజికవేత్త పోతుల రాముల యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబం అయినా దాత్రపు నరసయ్య సుగుణమ్మ కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇటీవల మృతి చెందిన బోహిని అంజయ్య కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి ఏ ఆపద వచ్చిన సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా కోక్కలకొండ బాబు ,బుడిగ రామచంద్రం ,రేణిగుంట సత్యనారాయణ ,శ్రీపతి అనిల్ కుమార్, నిల పాపయ్య, దొమ్మాట వెంకటేశం, వస్పరి నరసింహులు ,మంత్రి సత్తయ్య, బోయిని నర్సింలు తదితరులు పాల్గొన్నారు

