“రైతు పండుగ మహాసభను విజయవంతం చేద్దాం”
-రుణమాఫీ పై ఇచ్చిన మాట తప్పని రేవంతన్న కాంగ్రెస్ ప్రభుత్వం…
చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న
మన సాక్షి గొంతుక జనగామ నియోజకవర్గం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ సందర్భంగా కాంగ్రెస్ పాలన ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతు సోదర సోదరీమణులకు శుభాభినందనలు అని చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల శ్రేయస్సు కొరకు పనిచేస్తుందని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నిటినీ అమలుచేస్తున్నామన్నారు.ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500/- చొప్పున బోనస్ ను రైతుల ఖాతాలో జమచేసిందని తెలిపారు.ఇదివరకే రైతు రుణమాఫీ చేశామని, ఇంకా వివిధ కారణాలతో రుణమాఫీ కాకుండా మిగిలిన 3 లక్షల మంది అర్హులైన రైతులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందని వారికి కూడా త్వరలో రుణమాఫీ చేస్తుందని తెలిపారు.అలాగే రైతు పంటకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా ను కూడా ఈ సంక్రాంతి పండుగ వరకు రైతుల ఖాతాల్లో జమచేస్తారని తెలిపారు. ఇవన్నీ రైతుల సంక్షేమం కోసం చేసినవే అని ఇంకా ముందు ముందు రైతుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28 నుండి 30 వరకు రైతు పండగ అనే కార్యక్రమం చేపట్టిందని ఈ నెల 30 నా మహబూబ్ నగర్ లో భారీ రైతు బహిరంగసభఉందనితెలియజేశారు.ప్రభుత్వం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని , ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు కి, జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కి మా తరపున రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.