పార్టీ ఉనికి కోసమే దీక్ష దివస్
టిఆర్ఎస్ నాయకులు ఎన్ని తపస్సులు చేసినా ప్రజలునమ్మరు

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, ఓ బి సి మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగ రావు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
టిఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే దీక్ష దివాస్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నారని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, ఓ బి సి మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగ రావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు ఎన్ని తపస్సులు చేసినా ప్రజలు నమ్మరు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణలో ఉన్న ప్రజలు, ఉద్యమకారులు ,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు పోరాటం చేసి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియమ్మ తో మాట్లాడి తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే నా పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ప్రజలకు చెప్పి మోసగించి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిన, మళ్లీ జరిగిన ఎంపి ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయినా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేశారని అన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి, చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇంకా కొంతమందికి రుణమాఫీ రానున్న రోజుల్లో పూర్తి చేస్తుందని, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం సాధ్యమని అన్నారు.

